నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు, నందమూరి సుహాసిని హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ ప్రజలకు, పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.