పాలమూరు గ్రిల్ రెస్టారెంట్‌లో అధికారుల తనిఖీలు

కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన మష్రూమ్స్, పాత ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, వంటగదిలో అపరిశుభ్రత, తుప్పు పట్టిన ఫ్రీజర్లు, సరైన శానిటైజేషన్ లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. ఆహార నాణ్యత నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్‌పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్