జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే పనిమనిషి తన బంధువుతో కలిసి సుమారు 429 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు సమాచారం. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి 178.32 గ్రాముల బంగారం, వెండి వస్తువులు మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.