బోండా గొంతులో ఇరుక్కొని రమేష్‌ మృతి

మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దాసరి రమేష్‌ (45) అనే లారీ డ్రైవర్‌ యూసుఫ్‌గూడ సమీపంలోని టిఫిన్‌ సెంటర్‌లో బోండాలు కొనుక్కుని తింటుండగా అవి గొంతులో ఇరుక్కుపోయాయి. ఊపిరాడక విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా రమేష్‌ మృతిచెంది ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు పోలీసులకు లభించాయి.

సంబంధిత పోస్ట్