రెండు కిడ్నీ మార్పిడుల తర్వాత స్నేహా రాజు అంటార్కిటికాలో అడుగుపెట్టారు

హైదరాబాద్‌కు చెందిన స్నేహా రాజు రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకుని, ప్రపంచంలోనే తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టి అరుదైన ఘనత సాధించారు. డిసెంబర్ 17 నుంచి 28 వరకు జరిగిన ఈ యాత్రలో ఆమె అంటార్కిటికాలో రాత్రి బస చేసి, అంటార్కిటిక్ సర్కిల్‌ను విజయవంతంగా దాటారు. మూడేళ్ల వయసులో కిడ్నీ సమస్య గుర్తించబడిన స్నేహా, ఏడేళ్ల వయసులో తొలి కిడ్నీ మార్పిడి, 2013లో రెండో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అనారోగ్యం తన కలలకు అడ్డుకాదని నిరూపిస్తూ, అవయవ మార్పిడి జీవితం ముగింపు కాదని, కొత్త ఆరంభమని ఆమె నిరూపించారు. గతంలో చాదర్ ట్రెక్‌ను పూర్తి చేసి ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన స్నేహా, ఇప్పుడు అంటార్కిటికా యాత్రతో అందరికీ ప్రేరణగా నిలిచారు.

సంబంధిత పోస్ట్