మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన అంగన్వాడి సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంపై సోమవారం బేగంపేట టూరిజం ప్లాజాలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాఖ అధికారులు, పోషకాహార నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చిన్నపిల్లల వైద్యులు హాజరయ్యారు.