తెలంగాణ EAPCET ఇంజినీరింగ్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రిక్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TG EAPCET)కు సంబంధించిన ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లను ఉన్నత విద్యా మండలి తాజాగా విడుదల చేసింది. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫైయింగ్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత వారం అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్