మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం: 8వేల శక్తి భవనాలకు శంకుస్థాపన

తెలంగాణలో మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ భవనాలు మహిళా సంఘాలకు సమావేశాలు, ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆడబిడ్డల అండతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని, భవిష్యత్తులో రైస్ మిల్లులు, సూపర్ బజార్లు, లాజిస్టిక్ గోడౌన్లను మహిళా సంఘాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్