జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు ప్రచారం చేపట్టారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వారు ఆరోపించారు. తమకు ఉద్యోగాలు రావాలంటే జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని నిరుద్యోగులు అక్కడి ప్రజలను వేడుకున్నారు. మోకాళ్లపై నిలబడి వారు కాంగ్రెస్ ను ఓడించాలని ప్రాధేయపడ్డారు.