బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ లంబగుండు ప్రాంతంలో షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) అనే కారు డ్రైవర్ SIR జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను జైలుకు పంపుతారేమోనని, తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారోనని ఆందోళన చెంది, ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.