వింగ్స్ ఇండియా 2026: భట్టి, రామ్మోహన్ నాయుడు ఏరోస్పేస్ అభివృద్ధిపై చర్చ

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, భారతదేశ వైమానిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే విమానయాన రంగాన్ని వ్యూహాత్మక రంగంగా గుర్తించారని తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 100 శాతం పునరుత్పాదక శక్తితో పనిచేస్తోందని, తెలంగాణ హరిత, డిజిటల్ విమానయాన భవిష్యత్తుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విమానయానం దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్