చలానాల నుంచి తప్పించుకోవాలని నంబర్ ప్లేట్ మార్పు.. అరెస్ట్

ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి తన యాక్టివా వాహనం నంబర్ ప్లేట్‌ను మార్చిన సయ్యద్ ఒమర్ అనే వ్యక్తిని ఆదివారం టప్పాచబుత్రా పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనం నంబర్ TS12EPను TS12EBగా మార్చడంతో అసలు యజమాని షేక్ అన్వర్‌కు తప్పుడు చలానాలు వెళ్లాయి. ANPR కెమెరాల సహాయంతో నిందితుడిని గుర్తించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవిస్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్