ఆటో డ్రైవర్ హత్య కేసు: 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

హకీంపేట టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ముజామిల్ అలియాస్ ఆయుబ్ (24) హత్య కేసును టోలీచౌకి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వివరాలు వెల్లడించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ విషయంలో గొడవపడి ఖాలీద్ అనే వ్యక్తి ఆయుబ్ ను ప్లాస్టిక్ వైరుతో గొంతు బిగించి హత్య చేసి, మొబైల్ ఫోన్ తో పరారయ్యాడని ఏసీపీ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్