కార్వాన్: అధ్వానంగా రహదారి.. తప్పని ఇబ్బందులు

కార్వాన్ పరిధిలోని షర్పీ కమాన్ దర్గా ఏరియాలో రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు రోడ్డుపై వాహనాలు వెళ్లడంతో రోడ్డు కొట్టుకుపోయింది. రాళ్ళు తేలి రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. నూతన రోడ్డు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్