హైదరాబాద్‌లోని టోలిచౌకి రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనంలో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే వాహనాన్ని వదిలి పక్కకు వెళ్లి, సమీప దుకాణం నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.