కార్వాన్ నియోజకవర్గ సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరిస్తున్నామని ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి వారి సమస్యలకు సంబంధించి వినతిపత్రాలు అందజేశారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.