లాంగర్ హౌస్ పరిధిలోని టిప్పు ఖాన్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డు వేసి చాలాకాలం అవుతుండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో ప్రయాణం చేస్తూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వాహనదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.