సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ కాన్వాయ్

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించింది. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సీఎం పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోడ్లు బ్లాక్ చేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతిస్తూ కాన్వాయ్‌ను పంపించారు. ఈ చర్య ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది.

సంబంధిత పోస్ట్