వృత్తి శిక్షకుల హక్కుల కోసం పోరాటం: నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

తెలంగాణ వృత్తి శిక్షకుల అసోసియేషన్ (టీవీటీఏ) నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ - టీఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు కాసాల ప్రవీణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎండీ ఇస్మాయిల్, గౌరవాధ్యక్షులు ఇంజన్ శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు రాజవర్ధన్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా వృత్తి శిక్షకుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతన సవరణ వంటి అంశాలపై ఐక్యంగా పోరాడతామని నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీ, పీఆర్టీయూ నేతల మద్దతు తమకు అదనపు బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్