విద్యార్థులకు శుభవార్త: రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జూన్ నెలకు సంబంధించిన రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సోమవారం విడుదల చేసింది. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్లను సంక్షేమ శాఖలకు అందిస్తామని, నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేయాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి ఖాతాల్లో ఆగస్టు 15న ఈ నిధులను జమ చేయనుంది. ఈ నిధుల విడుదల విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.

సంబంధిత పోస్ట్