బాపుఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి గవర్నర్, మంత్రుల నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపుఘాట్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు నివాళులు అర్పించారు. సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్