కార్వాన్ లో గురువారం శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లోని చెత్తను క్లియర్ చేశారు. ఈ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ స్వామి యాదవ్ దగ్గరుండి పరిశీలించారు. క్లియర్ చేసిన అనంతరం ఆయా ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని సిబ్బందికి సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.