మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బౌరంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి లక్ష్మీనారాయణ 578 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఘట్కేసర్ పాఠశాలకు చెందిన యామిని 576 మార్కులతో రెండో స్థానం, బాలానగర్ పాఠశాలకు చెందిన రేణుక 574 మార్కులతో మూడో స్థానం, నాగోల్ పాఠశాలకు చెందిన బిందు శ్రీ 573 మార్కులతో నాలుగో స్థానం, పొన్నాల్ పాఠశాలకు చెందిన రోషిని 573 మార్కులతో ఐదో స్థానం సాధించారు. ఈ ఫలితాలు హైదరాబాద్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల విద్యార్థుల ప్రతిభను చాటుతున్నాయి.