ఉప్పరపల్లి వద్ద నదిని తలపిస్తున్న మెయిన్ రోడ్డు

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి వద్ద పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 191 సమీపంలో రహదారి పూర్తిగా జలమయమైంది. భారీగా వరద నీరు చేరడంతో రోడ్డు నదిని తలపించింది. దీంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్