గోల్కొండ కోటను సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు 4.13 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోటకు వచ్చారని ఓ సర్వేలో తేలింది. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలలో మొదటి స్థానంలో తాజ్ మహల్ ఉండగా, మన గోల్కొండకు 8వ స్థానం దక్కింది. తాజ్ మహల్, కోణార్క్, కుతుబ్ మినార్, ఎర్రకోట, అగ్రా, ఎల్లోరా గుహలు, ఉదయగిరి, గోల్కొండ, గోవా, హాజర్దూం లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.