బంజారాహిల్స్‌లో 530 కిలోల కల్తీ నెయ్యి సీజ్

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని భోలానగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు బుధవారం సీజ్ చేశారు. పక్క సమాచారంతో తయారీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు సుమారు 530 కేజీల కల్తీ నెయ్యితో పాటు తయారీకి వాడే బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 18 లక్షలు ఉంటుందని అంచనా.

సంబంధిత పోస్ట్