పంజాగుట్ట NIMS ఆస్పత్రిలో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి ఆవరణలో నిర్మాణ పనులు చేసే కూలీ కుటుంబం నివాసం ఉంటుండగా, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం పంజాగుట్ట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.