బంజారాహిల్స్ సేవాలాల్ బంజారా భవన్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ల మధ్య శుక్రవారం వాగ్వాదం చోటుచేసుకుంది. "బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క కార్డు ఇవ్వలేదని" మంత్రి వ్యాఖ్యలపై శ్రవణ్ తీవ్రంగా స్పందిస్తూ "6 లక్షల కార్డులు ఇచ్చాం" అన్నారు.