బేగంపేట: మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి

ప్యారడైజ్ మెట్రో స్టేషన్ మొదటి అంతస్తు రేలింగ్ పై నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి, కాలు విరగడంతో పాటు చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. బేగంపేట ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, అతని పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు వ్యక్తి వివరాలు సేకరిస్తూ, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యాయత్నమా అని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్