ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిందంటూ ఐ డ్రీమ్ ఛానెల్ పై శనివారం బంజారాహిల్ పీఎస్ లో పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. గత నెల 25న అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ తో ఇంటర్వ్యూలో యాంకర్ సౌమ్య రెడ్డి ఫోన్ ట్యాంపింగ్ పేరుతో కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ సౌమ్యారెడ్డి, అరుణ్ కుమార్, ఐ డ్రీమ్ ఛానెల్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.