ఖైరతాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ వాతావరణం

ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, దానం నాగేందర్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారా హిల్స్ లోని లేక్ వ్యూ బంజారా లో నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు సంగీత తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్