ఇంటర్ సిలబస్‌లో కోత: విద్యార్థులకు ఊరట

ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1బీ, కెమిస్ట్రీ సబ్జెక్టులలో కఠినమైన సిలబస్‌ను తొలగించారు. మ్యాథ్స్‌లో 30 శాతం, కెమిస్ట్రీలో 30 శాతం సిలబస్‌ తగ్గించారు. మరికొన్ని సబ్జెక్టుల్లోనూ 20 శాతం సిలబస్‌ను తగ్గించారు. కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలు 2026-27 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయి. తెలుగు, హిస్టరీ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోగా కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వస్తాయి. వేసవి సెలవుల్లో లెక్చరర్లకు కొత్త సిలబస్‌పై శిక్షణ ఇస్తారు.

సంబంధిత పోస్ట్