డీఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ ఎండీ సుదర్శన్రెడ్డికి హై9 స్టార్ పిల్లర్స్ అవార్డు

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఎస్ఆర్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డి.సుదర్శన్రెడ్డికి ఆరోగ్యరంగంలో విశేష సేవలందించినందుకు గాను హై9 స్టార్ పిల్లర్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హై9 స్టార్ పిల్లర్స్ సంస్థ డైరెక్టర్ శివకుమార్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వ్యక్తులకు పురస్కారాలు అందజేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సుదర్శన్రెడ్డి ఈ పురస్కారం తనపై బాధ్యతను పెంచిందని, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్