నాకు పెళ్లి అయి 16 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా, ఇప్పటికీ రాలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాకు నూతన రేషన్ కార్డు రావడం చాలా ఆనందంగా ఉందని నంది నవనీత శుక్రవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో శుక్రవారం తెలిపారు. రేషన్ కార్డుతో పాటు మొదటిసారి సన్న బియ్యం తీసుకోబోతున్నాను. ఇది ఎంతో సంతోషకరం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు.