హైదరాబాద్: ఆర్టీసీ బస్ భవన్లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ భవన్‌లో సెల్లార్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యూపీఎస్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. చిక్కడపల్లి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్