విలక్షణ నటుడు, మాజీ MLA కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట.. ఇవాళ ఉదయం 4 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని తన ఇంట్లోనే కన్నుమూశారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన ఆయన, 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 750కు పైగా సినిమాల్లో విశేషంగా నటించిన కోట.. సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖులు సందర్శిస్తున్నారు.