హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫేక్ వీడియోలపై దాఖలు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలో తప్పుడు వీడియో ప్రచారం చేశారంటూ కేటీఆర్, జగదీష్ రెడ్డిపై మల్లన్న ఫిర్యాదు చేశారు. అయితే ఆధారాల్లేవన్న కారణంతో పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారికి న్యాయంగా ఉపశమనం లభించింది.