బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్‌కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 3న ఆస్పత్రిలో చేరి 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.