హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లో 55, 378, ఖైరతాబాద్ లో 1, 953 కొత్త కార్డులు పంపిణీ అవుతున్నాయని చెప్పారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.