ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి సెప్టెంబర్ 23 రాత్రి 11: 59 గంటల వరకు మాత్రమే అవకాశం. అనంతరం సెప్టెంబర్ 24న నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బారికేడ్లు, షెడ్లను తొలగించనున్నారు. సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి సందర్భంగా ఉదయం 6 గంటలకు ట్యాంక్‌బండ్ వైపు శోభాయాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జన ప్రాంతానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు క్రేన్, ప్లాట్‌ఫాం పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.