తెలంగాణ వ్యవసాయ, సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం హైదరాబాద్ లోని సచివాలయంలో చేనేత, జౌళి శాఖ టెస్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ కార్యకలాపాలు, చేనేత కార్మికుల సంక్షేమ పథకాల అమలు, నూలు సబ్సిడీ, రుణాలు, గద్వాల్, పోచంపల్లి చీరల ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ వ్యూహాలపై చర్చించారు. చేనేత కార్మికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.