కవిత వ్యాఖ్యలను ఖండించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటీవల కవిత చేసిన 'రాష్ట్రంలో రాక్షస పాలన' వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోందని, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వంపై కవిత అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కవిత తన సొంత తండ్రిని రోబో అనడం తగదని, తల్లిదండ్రులను గౌరవించుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్