ఆటో డ్రైవర్ కుటుంబానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేత

ఆటో డ్రైవర్ శ్రీకాంత్ ఆత్మహత్యతో దిక్కుతోచని స్థితిలో పది రోజులుగా శ్మశానవాటికలోనే తలదాచుకుంటున్న మృతుడి కుటుంబ దీనగాథ ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చూసి చలించిన ఖైరతాబాక్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన టీమ్ సభ్యుల ద్వారా బాధితులకు రూ. 50,000 నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్