ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా, సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఎలక్ట్రిక్ కారులో మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ప్రయాణించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీల కొనుగోలుపై 10 నుంచి 20% ప్రోత్సాహకం అందించడానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్‌ను ఆయన అభినందించారు. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వం 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని మంత్రి తెలిపారు.