గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్‌నగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అప్పట్లో మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటేనే అందరూ భయపడేవారని మండిపడ్డారు. ప్రస్తుతం సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, తప్పు చేయనివారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.