డిక్షనరీలో ‘తెలంగాణ’ పదం లేదన్న బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. షాద్ నగర్ గడ్డపై పుట్టి తెలంగాణ పదం లేదనడం ఎవరి మెప్పుకోసమో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర తెలియని వారు ఈ గడ్డపై పుట్టినట్లు కాదని, కేవలం చంద్రబాబు నాయుడి సంతోషం కోసం ఇలా మాట్లాడితే చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని శ్రవణ్ హెచ్చరించారు.