అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించగా ఎంపీ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలనెల జీతాలు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.