కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి సమీపంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీటు బెల్ట్ కారణంగా కారులోనే చిక్కుకుపోయిన ఒకరు ఊపిరాడక మృతి చెందారు. స్థానికులు మిగతా వారిని రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు సీపీఆర్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్