మా బాస్ కేసీఆర్: ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్ గిరి అభివృద్ధి పనుల శంఖుస్థాపన అనంతరం జరిగిన సభలో మాజీ సీఎం కేసీఆర్ ను 'మా బాస్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలే తనకు అండగా ఉన్నారని, తనతో ఉంటే లాభమే తప్ప నష్టం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా 'జై కేసీఆర్' నినాదాలు మిన్నంటాయి. ఈటెల వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తిరిగి తన సొంత గూటికి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్