ఎస్ పి ఆర్ హిల్స్ లోని వినాయక్ నగర్ బస్తీలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రజా వెలుగు పార్టీ ఉపాధ్యక్షులు, జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎర్రోళ్ల ప్రవీణ్ కుమార్, బస్తీ అధ్యక్షులు హరి కిషోర్, దేవేందర్, జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోలియో కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాలలో జరిగింది.